Humility by Andrew Murray in telugu - Telugu christian books
Processing: – Dispatch:
Shipped from: Hyderabad (Map for Verification)
EachDayKart® QuickShip: Hyderabad, Vizag Region (T&C Apply)
అండ్రూ ముర్రే రచించిన వినయము పుస్తకం తెలుగులో అందుబాటులో ఉంది. ఈ క్రైస్తవ గ్రంథం వినయాన్ని ఆత్మీయంగా అర్థం చేసుకోవడానికి, ఆత్మవికాసం మరియు దేవునితో మరింత సన్నిహిత సంబంధం ఏర్పరచుకోవడానికి సహాయపడుతుంది. ఆధ్యాత్మిక ఆలోచనలకు మార్గదర్శకంగా, విశ్వాసాన్ని బలోపేతం చేసుకోవాలనుకునే వారికి ఇది ఒక విలువైన పుస్తకం.
- Language: Telugu
- paperback
- Publisher: CTBR
- Fulfillment by: Eachdaykart
Description
క్రైస్తవ జీవితంయొక్క పరిపూర్ణతకు అత్యవసరమైన 'వినయము' అనే అంశానికి మనముందున్న ఒకే ఒక్క ఉదాహరణ మన ప్రభువైన క్రీస్తుయేసు జీవితంమాత్రమే. ఆయన జీవితం 'వినయము' అనే సూత్రంపై ఎంతగా ఆధారపడి ఉందో మనం గ్రహించ వలసిన అవసరత ఉంది. ఆ గ్రహింపుమాత్రమే మనల్ని ఆయన జీవితపు లోతుల్లోకి తొంగిచూసేలా చేస్తుంది. అది మాత్రమే ఆయన జీవితాన్ని మనము అనుకరించేందుకు పురికొల్పుతుంది. అది మాత్రమే ఆయన పోలికలోనికి మార్చబడాలన్న లోతైన ఆశను మనలో జనింపజేసి ఆ తృష్ణను ఉజ్జీవింపజేస్తుంది.
'వినయము' మాత్రమే మనకు పరలోక సౌందర్యాన్నీ, క్రీస్తుయేసు సారూప్యాన్నీ ఇస్తుంది. 'గర్వము' అత్యున్నతమైన పరలోక రాజ్యములో ఉండే దేవదూతలను దయ్యాల స్థాయికి పడద్రోస్తుంది, అదే సమయంలో 'వినయము' పడిపోయిన స్థితిలోవున్న మాన వులను దేవదూతల స్థాయికి హెచ్చిస్తుంది. పడిపోయిన దేవదూతలకు సంబంధించిన 'గర్వము'నకును-దేవుని గొట్టెపిల్లకు సంబంధించిన 'వినయమునకును మధ్య నిరంతర యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధం నీలోనే జరుగుతోంది. నీలో 'గర్వము' ఉందంటే, పడిపోయిన దేవదూతయైన అపవిత్రాత్మ నీలో నివసిస్తోందన్నమాట. అదేవిధంగా, నీలో 'వినయము' ఉందంటే, దేవుని గొట్టెపిల్లయైన క్రీస్తు నీలో నివసిస్తున్నాడన్నమాట.
'గర్వము' నీకుచేసే కీడునూ అది నీకు కలిగించే నష్టాన్నీ నీవు తెలుసుకొన్నట్లయితే, నీవు దానిని అమితంగా అసహ్యించుకొంటావు. ఎంత క్రయం చెల్లించైనాసరే దానినుండి విడుదల పొందాలని నీవు ఆశిస్తావు. అదే సమయంలో 'వినయము నీకుచేసే మేళ్ళనూ అది నీలో సృష్టించే ప్రశాంతతనూ అది నీలో రూపొందించే నూతనస్వభావాన్నీ అది నీకిచ్చే దైవిక ఆనందాన్నీ నీవు గమనించినట్లయితే, ఈ లోకంలో నీ సహమానవుల పాదధూళిగా ఉండైనాసరే దానిని సంపాదించేందుకు నీవు ప్రయత్నిస్తావు.
'గర్వము' దేవుని ఉగ్రతకును దేవుని శాపానికిని మనలను గురిచేయగా, 'వినయము' మనలను దేవుని కృపకు సమీపంగా తీసుకొని వెళుతుంది, దేవుని ఆశీర్వాదపు వర్షాన్ని మనపై కురిపింపజేస్తుంది. 'గర్వము' మనలను నిత్య మరణమునకును నిత్య నరకము నకును నడిపించగా, 'వినయము' మనలను నిత్య జీవమునకును నిత్యానందం వెల్లివిరిసే పరలోకమునకును నడిపిస్తుంది.
అనేకులను క్రీస్తువద్దకు నడిపించి వారు క్రీస్తు అడుగుజాడల్లో జీవించునట్లు వారి ఆత్మీయాభివృద్ధికి కావలసిన అనేక అత్యద్భుతమైన రచనలను చేసిన ఆండ్రూ ముర్రే కలంనుండి వెలువడిన 'వినయము' అనే ఈ చిన్ని పుస్తకము గర్వాన్ని జయించడం ఎలానో 'వినయము'ను స్వంతం చేసుకోవడం ఎలానో నీకు నేర్పిస్తుంది. సాతానుడి గర్వపు సంకెళ్ళనుండి విడుదల పొంది సాత్వికుడును దీనమనస్సు గలవాడును అయిన క్రీస్తుయేసు సారూప్యంలోనికి నీవు మార్చబడేందుకు ద్వారాలను తెరుస్తుంది.