తండ్రీ అని ఆయనను పిలిచేందుకు నేను సాహసించాను | I Dared to Call Him Father by Bilquis Sheikh | Telugu Christian Books
తండ్రీ అని ఆయనను పిలిచేందుకు నేను సాహసించాను | I Dared to Call Him Father by Bilquis Sheikh | Telugu Christian Books
Free shipping over Rs.499, Expected to be dispatched: - .
"I Dared to Call Him Father" is an incredibly powerful story of faith & courage that will resonate with Telugu Christian readers. Revered as a timeless classic, this book is full of insight & wisdom, as a unique story of a woman's journey from despair to joy. Embrace your spiritual side with this exquisite addition to your library.
- Paperback
- Dimensions: length: 18.5cm, width: 12.3cm, spine: 1cm
- 238 pages
- Language: Telugu
- Publisher: CTBR
- Fulfillment by: Eachdaykart
- Delivered by: Amazon
Description
దేవునికి నన్ను నేను సంపూర్ణంగా సమర్పించుకోడం ఎలా? నేనలా చేసినప్పుడు ఏం జరుగుతుంది? నన్ను సంరక్షించే విషయంలో దేవుడు నిజంగా తన వాగ్దానాలను నెరవేర్చుతాడా?
పై విధంగా ప్రశ్నించుకొనే ప్రతి ఒక్కరికీ సరైన సమాధానాల్ని యిచ్చేదే ‘తండ్రీ అని ఆయనను పిలిచేందుకు నేను సాహసించాను’ అన్న ఈ పుస్తకం.
తన జీవితంలోని రెండు బాటల కూడలివద్ద అలాంటి ప్రశ్నల్ని ఎదుర్కొన్న బిల్ఖిస్ షేక్ అనే ఒక సుసంపన్న కుటుంబానికి చెందిన పాకిస్తానీ ముస్లిమ్ వనిత వాస్తవ గాథే ఈ పుస్తకం. పాకిస్తాన్ మంత్రి అయిన తన భర్తచేత విడిచిపెట్టబడిన తరువాత మనశ్శాంతిని పొందేందుకు ప్రకృతి సౌందర్యాల మధ్య సువిశాలమైన తోటలో కట్టబడిన అత్యంత విలాసవంతమైన ఒక భవంతిలో తన తదుపరి జీవితాన్ని గడిపేందుకు ఆమె నిర్ణయించుకొంటుంది. అయితే తనలోని నిరాశా నిస్పృహలవల్ల ఆమె తీవ్రమైన కృంగుదలకు గురౌతుంది. ఖురాన్ను చదువుతున్నప్పుడు ప్రవక్త అయిన యేసును గూర్చిన అనేక విషయాలను ఆమె తెలుసుకొంటుంది. ఆయనను గురించి యింకా ఎక్కువగా తెలుసుకోవాలన్న కుతూహలం కొద్దీ బైబిలు పుటల్ని త్రిప్పటం ప్రారంభిస్తుంది. అలా త్రిప్పుతున్నప్పుడు ప్రభువైన యేసును గురించిన అనేక సత్యాలు ఆమె హృదయాన్ని కదిలించి వేస్తాయి.
ఆ తరువాత వచ్చిన వరుస వింత కలలతో ప్రారంభమైన ఆమె అన్వేషణ ఆమె హృదయాన్నీ, మనస్సునూ, ఆత్మనూ కుదిపివేసి చివరిగా ఆమె జీవితాన్నే పూర్తిగా మార్చివేస్తుంది