Families In the plan of God by Beulah Wood in Telugu
Processing: – Dispatch:
Shipped from: Hyderabad (Map for Verification)
EachDayKart® QuickShip: Hyderabad, Vizag Region (T&C Apply)
- Telugu Title: దేవుని ప్రణాళికలో కుటుంబాలు; కుటుంబ దైవశాస్త్రం
- Language: Telugu
- Binding: Paperback
- Publisher: Good shepherd Books
- Fullfillment by: Eachdaykart India strategic unit
- Measurements: 21L x 14W x 1H
- Weight: 0.360g
- No of Pages: 308
- Genre: Religion & Spirituality
- ISBN: 9789381905043
Description
South Asian Pastors, families, and theological colleges need a Christian text on family geared to their cultures needs and addressing felt problems in the 21st century. What is the Christian view of parenting? What is an appropriate theology of marriage and inheritance? How can young people be protected? Beulah Wood seeks the over-arching principles.
దక్షిణాసియా పాస్టర్లకు, కుటుంబాలకు, వేదాంత కళాశాలలకు వారి సాంస్కృతిక అవసరాలను సంధిస్తూ, 21వ శతాబ్దంలో ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారం చూపుతూ, కుటుంబంపై రాసిన ఒక క్రైస్తవ పాఠ్యపుస్తకం కావాలి. పిల్లల పెంపకం గురించి క్రైస్తవ దృక్పథం ఏమిటి? వివాహానికి, వారసత్వపు హక్కులకు తగిన వేదాంతం ఏమిటి? యువతను కాపాడుకోటం ఎలా? బ్యూలా వుడ్ గారు వీటన్నిటికి బలీయమైన సూత్రాలను అన్వేషిస్తారు.
ఒక పసిబిడ్డ తొలి, అత్యావశ్యక విద్యాభ్యాసానికి కుటుంబం చాలా ముఖ్యం. బ్యూలా వుడ్ గారు మరొకసారి సమయానుకూలమైన రచన అందించారు. ఇది కుటుంబ నేపథ్యంలో బైబిలుకు, భారతీయ సంస్కృతికి మధ్య అత్యవసరమైన సృజనాత్మక సంవాదం. దీన్ని చదవడం ద్వారా మీరు ఎంతగానో ఆనందిస్తారు, గొప్ప లాభం పొందుతారు. ప్రతి తల్లి/తండ్రి, కాబోయే తల్లితండ్రులు ఈ పుస్తకాన్ని తప్పక చదవాలి.
రెవ. ఎఫ్. రాంకుమ, పిహెచ్, సయాక్స్, బెంగళూరు. శిష్యత్వం అంటే వట్టి మతమార్పిడి కాదు. దక్షిణాసియాలోని సంఘం యేసు క్రీస్తువారి అనుచరుల ప్రాపంచిక దృక్పథాలను రూపాంతరం చెందించడంలో విఫలమైనపుడు దాని ప్రభావం లోపించింది. భార్యల స్థానం, వారి పాత్ర, పిల్లల అవసరాలు మొదలైన విషయాల్లో సంఘం సంస్కృతికి తలవంచిందా? కఠినమైన ప్రశ్నలతో తలపడటానికి ఈ పుస్తకం మనకు సహాయం చేస్తుంది.
డా. ఆశిష్ క్రిస్పాల్, పిహెచ్, ఇంటర్నేషనల్ రీజనల్ డైరెక్టర్- ఆసియా, ఓవర్సీస్ కౌన్సిల్. భారతీయ కుటుంబం, సంబంధ బాంధవ్యాలపై డా. బ్యూలా వుడ్ గారు ఈ పుస్తకంలో అమోఘమైన మార్గదర్శక సూత్రాలను పొందుపరచారు. నేనీ పుస్తకాన్ని వ్యక్తులకు, దంపతులకు, సెల్ గ్రూపులకు, ఫ్యామిలీ సెమినార్లకు ఎంతగానో సిఫారసు చేస్తున్నాను. ఇది ప్రేమ, వివాహం, కుటుంబాల గురించి పునరాలోచన చెయ్యడానికి మనలను సవాలు చేస్తుంది. శ్రేష్టమైన వివాహాలకు నడిపించే పాత్రలు, బాధ్యతలను గుర్తించడానికి సహాయం చేస్తుంది.
ప్రమీలా రాజేంద్రన్, మాజీ డైరెక్టర్, మెంబర్ కేర్, ఇండియా మిషన్స్ అసోసియేషన్, హైదరాబాద్ కుటుంబాన్ని గురించిన ఈ రచన యథార్థమైనది, వాక్యానుసారమైనది, దక్షిణాసియా సందర్భానికి తగినది. ఎందుకంటే మనకున్న గొప్ప అపాయం పరిమిత కుటుంబానికి సంబంధించినది, గనుక రచయిత కొన్ని కేస్ స్టడీలు, బైబిలు వివరణ, చర్చకు యోగ్యమైన ప్రశ్నలు, బలమైన కుటుంబాలకు ఒక నమూనాను అందిస్తున్నారు. ప్రతి పాస్టర్కు, టీచర్కు ఇది సమయానుకూలమైన పుస్తకం. పెద్దల సండేస్కూలుకు ఉపయోగపడే మంచి మెటీరియల్.
రెవ. బెంజమిన్ సిఎ, నేషనల్ డైరెక్టర్, ఫీబా ఇండియా, బెంగళూరు బ్యూలా వుడ్ బిడి, డిమిన్ గారు 1968 నుంచి భారత్, నేపాల్ దేశాలలో సుదీర్ఘకాలం బోధించి, ప్రసంగాలు చేసి, పుస్తకాలకు సంపాదకత్వం వహించి, స్వయంగా రచనలు చేశారు. కుటుంబంపై రచనలు చేయడం వారికి అత్యంత ప్రీతిపాత్రమైన పరిచర్య. భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఒకరినొకరు బలపరచుకునే సంబంధాలు ఉండాలని ఆకాంక్షిస్తూ, ఈ సందేశాన్ని ఇతరులకు అందజేయడానికి స్త్రీ పురుషులకు తగిన వనరులు అందజేస్తున్నారు. ప్రస్థుతం బెంగళూరులోని సయాక్స్లో ఉంటున్న డా. బ్యూలా వుడ్ గారు ఒక చిన్నబిడ్డగా, తోబుట్టువుగా, భార్యగా, తల్లిగా, విధవరాలుగా, అమ్మమ్మ, నాయనమ్మగా కుటుంబ జీవితాన్ని అనుభవించారు.