▪️ పుస్తకం పేరు / Title: Enjoy Your Bible – Telugu Edition
▪️ రచయితలు / Authors: William MacDonald & Arthur Farstad
▪️ ప్రచురణ / Publisher: Good Shepherd Books
▪️ ISBN: 978-93-81905-44-9
▪️ భాష / Language: Telugu
▪️ ఫార్మాట్ / Format: Paperback
▪️ పేజీలు / Pages: Around 80+ pages
▪️ ముద్రణ పరిమాణం / Size: Standard A5
▪️ వర్గం / Category: Christian Study, Bible Meditation
▪️ వారికి అనుకూలం / Suitable for: Bible Students, Youth, Telugu Christian Families
🔹 ఆనందకరమైన బైబిల్ అధ్యయనానికి మార్గదర్శకంగా ఉపయోగపడే విలువైన పుస్తకం
🔹 పవిత్ర గ్రంథాన్ని చదవడాన్ని ప్రేమగా, ఉత్సాహంగా చేయించే ఆచరణాత్మక సూచనలు
🔹 రచయితలదీ నూతన నిబంధనపై లోతైన గ్రహణశక్తి – స్పష్టత, సాహిత్య నైపుణ్యం అభివృద్ధి చేసిన రచన
🔹 బైబిల్ అధ్యయనం కొత్తగా ప్రారంభించేవారికి సహాయకరం – మొదటి అడుగులకు ఉత్తమ మార్గదర్శకం
🔹 బైబిల్ స్టడీ గ్రూప్స్, సెల్ మీటింగ్స్, మరియు వ్యక్తిగత ధ్యానానికి బాగా ఉపయోగపడుతుంది
Description
మీ బైబిల్ అధ్యయనాన్ని ఆహ్లాదకరంగా చేసే ఆచరణాత్మక సూచనలు
ఈ పుస్తకం అట్టమీద ఉపయోగించిన "ఆనందకరమైన”, “అధ్యయనం” అన్న పదాలు పరస్పర విరుద్ధంగా ఉన్నట్టు అనేకమందికి అనిపించవచ్చు. అనేక అంశాలతో మనం ఏకీభవించడానికే మొగ్గుచూపుతుంటాం. కాని ఒక విశ్వాసికి మాత్రం, కనీసం దేవుని వాక్య అధ్యయనమైనా ఉత్సాహభరితంగా, ఆహ్లాదకరంగా, ఆనందాన్నిచ్చేదిగా ఉండాలి. అనంత సాగరం లాంటి దేవుని వాక్యంలోనికి ముందుకు సాగడానికి చేసే మీ తొలి విహారయాత్రలకు శ్రీకారం చుట్టేందుకు ఈ చిరు సంపుటి మీకు సహాయకరంగా ఉండాలన్నదే మా ఆశ.
-ముందుమాట నుంచి-
విలియమ్ మెక్ డొనాల్డ్ గారు సుమారు యాభయ్యేళ్లపాటు క్రైస్తవ్యానికి సంబంధించిన కీలకాంశాలపై తేటగా, సరళమైన పదాలతో ఉపన్యసించారు. యేసు ప్రభువుకోసం పురోభివృద్ధి సాధిస్తున్న తన వ్యాపార వృత్తిని విడిచిపెట్టి, శోధింపశక్యం కాని క్రీస్తు ఐశ్వర్యమును ప్రకటిస్తూ ప్రపంచవ్యాప్తంగా పర్యటించారు. ఎనభైకి పైగా ఉన్న వీరి రచనల్లో స్పష్టత, మాటల్లో పొదుపు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. దైవవాక్య ధ్యానంలో విరివిగా సమయం వెచ్చించిన వారికే ఇది సాధ్యం. విలియమ్ మెక్ డొనాల్డరు రచన, బోధనా పరిచర్యలో పాల్గొంటూ అమెరికా దేశంలోని కాలిఫోర్నియాలో నివసించారు. 90 ఏళ్ల వయస్సులో, 2007లో ప్రభువు సన్నిధికి చేరుకున్నారు.
ఆర్థర్ ఫార్టడ్ గారు 1998లో మరణించక పూర్వం, గ్రీకు నూతన నిబంధనలోని అత్యధిక వాక్యభాగాన్ని మహా సమర్థవంతంగా, వాగ్ధాటితో సంరక్షించిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. డల్లాస్ థియొలాజికల్ సెమినరీలో న్యూటెస్టమెంట్ గ్రీకును బోధించారు, న్యూ కింగ్ జేమ్స్ తర్జుమాకు జనరల్ ఎడిటర్ గా సేవలందించారు. బిలీవర్స్ బైబిల్ కామెంటరీకి సంపాదకుడిగా మెక్డొనాల్డ్ గారితో కూడ సన్నిహితంగా పనిచేశారు.