Bible Survey Telugu By Bandaru Simon Telugu Christian Books
Processing: – Dispatch:
Shipped from: Hyderabad (Map for Verification)
EachDayKart® QuickShip: Hyderabad, Vizag Region (T&C Apply)
- Telugu title: బైబిల్ సర్వే: పరిశుద్ధ గ్రంథములోని 66 పుస్తకముల సంక్షిప్త వివరణ
- Author: బండారు సైమన్ సీజర్
- ముందుమాట: డా॥ జె. చిరంజీవి
- Publisher: Good Shepherd books
- Total Pages: 447
- Measurements: L:22 cm × W:14 cm × H:1 cm
-
Weight: 0.515kg
- ISBN: 978-93-93067-86-9
- Fulfillment by: Eachdaykart Indian strategic unit
Telugu Description
బైబిల్ సర్వే
బైబిల్ గ్రంథాన్ని ఎన్నిసార్లు చదివినా, అధ్యయనం చేసినా, అందులోని లోతైన జీవిత సత్యాలు, ప్రమాణాలు, నడవవలసిన విధానాలు త్రవ్విన కొలది తరగని గనులుగా ఉంటాయి. ఇట్టి గ్రంథాన్ని సామాన్య మానవునికి, క్రైస్తవ విశ్వాసికి, సువార్తికునికి, నాయకునికి, సంఘానికి అర్థమయ్యే రీతిలో ప్రచురించేందుకు చేసిన ప్రయత్నమే ఈ 'బైబిల్ సర్వే'. పరిశుద్ధ గ్రంథంలోని 66 పుస్తకాలను క్రోడీకరించి, ప్రతి పుస్తకాన్ని ఈ క్రింది విధంగా విభజించి, విశ్లేషించడం జరిగింది:
1. గ్రంథ పరిచయము
2. గ్రంథ విశ్లేషణ
3. గ్రంథ ఉద్దేశము
4. గ్రంథములోని ప్రత్యేకతలు
5. గ్రంథములో ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రస్తావన
6. గ్రంథమును ప్రస్తుత కాలమునకు అన్వయించుట 7. గ్రంథములో దేవుని కృప
"డా. బండారు సైమన్ సీజరుగారు పాత నిబంధనలో క్రీస్తు జాడలను గుర్తించి రక్షణ సిద్ధాంతానికి దేవుని ముందస్తు వాగ్దానాలను ప్రస్ఫుటపరిచారు. తెలుగు క్రైస్తవలోకానికి, దైవగ్రంథ పరిశీలనా ద్రష్టలకు 'బైబిల్ సర్వే' ఒక ఆధునిక సూచిక.”
#మోస్ట్ రెవ. గోవాడ దైవాశీర్వాదము, మోడరేటర్, దక్షిణ ఇండియా సంఘము, బిషప్, కృష్ణా-గోదావరి (కోస్టల్ ఆంధ్ర) అధ్యక్ష ఖండము "సంఘకాపరులు, సువార్తికులు, విశ్వాసులు మరియు బైబిల్ పండితులకు ఆలాగునే సామాన్య క్రైస్తవులకు కూడా అర్థమై సౌవార్తీకరణ పథకములో సర్వజాతులను శ్రీ యేసునాధుని చెంతకు నడిపించగలదని ప్రగాఢ విశ్వాసముతో ..."
రెవ. బి. ఎబినేజర్ షాజీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, మెట్రోపోలిటన్ మిషన్, విజయవాడ "క్రైస్తవ వేదాంతానికి భిన్నమైన వ్యాఖ్యలు ప్రబలుతున్న రోజుల్లో - పరిశుద్ధ గ్రంథములోని 66 పుస్తకములపై సంక్షిప్త వివరణనిచ్చే “బైబిల్ సర్వే” అనేకులు క్రైస్తవ ఆధ్యాత్మిక మర్మములను, సత్యాలను తెలిసికొని, యేసును వెంబడించుటకు, సువార్తసేవ చేయుటకు, దేవుని రాజ్య వ్యాప్తికై పనిచేయుటకు ఎంతగానో తోడ్పడుతుంది.”
డా॥ జె. చిరంజీవి, జనరల్ డైరక్టర్, సేవాభారత్, హైదరాబాదు.
డా॥ బండారు సైమన్ సీజర్ గారు నాలుగు దశాబ్దాల సేవానుభవము గల క్రైస్తవనాయకులు. పోస్టుగ్రాడ్యుయేషన్ అనంతరం వేదాంత విద్యనభ్యసించి, ఇశ్రాయేలు దేశమందలి జెరూసలేం యూనివర్శిటీ నుండి క్రీస్తుశాస్త్రంలో (క్రిష్ఠాలజీలో) పిహెచ్.డి. చేశారు. 'ద స్టోరీ అఫ్ అని ఫినిష బిల్డింగ్' అనే పుస్తకంతోపాటు అనేక రచనలు చేశారు. వీరు తన సతీమణితో చిత్తూరులో నివాసముంటున్నారు. వీరికి ఒక కుమార్తె, ఇద్దరు మనుమసంతానం.